14-02-2026 12:30:36 AM
తొర్రూరులో కారు జోరు
డోర్నకల్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
మహబూబాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఫలితా ల్లో ఉ మ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ హస్తవాసి పనిచేసింది. జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో డోర్నకల్, మరిపెడ, ములుగు, స్టేషన్ ఘనాపూర్, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలి టీల్లో చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి అవసరమైన పూర్తి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
ఇక మహబూబాబాద్, జనగామ, కేసముద్రం, వర్ధన్నపేటలో మ్యాజిక్ ఫిగర్ కు కొంత దూరంలో నిలిచింది. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలో సంపూ ర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మె ల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నా యక్ క్లీన్ స్వీప్ చేశారు. ఒక్క తొర్రూరులో మాత్రం పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రాంగం పనిచేసి బీ ఆర్ ఎస్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎ గరవేయనుంది.
ములుగులో మంత్రి సీతక్క హవా కొనసాగింది. అలాగే భూపాలపల్లి లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన సత్తాను చాటుకున్నారు. కొత్తగా ఏర్పడ్డ స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనక మంత్రి కడియం శ్రీహరి తన రాజకీయ పలుకుబడినిచాటుకున్నట్లయ్యింది. మహబూబాబాద్, జనగామ జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీలో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీ ఆర్ ఎస్ ఎ మ్మెల్యేలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయి మెజా ర్టీ సాధించలేక పోయారు.
అ లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు మహబూబాబాద్ మాజీ ఎమ్మె ల్యే వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కేసముద్రం కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చే సినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు, బీఆర్‌ఎస్ అభ్యర్థులు 8 వార్డుల్లో విజయం సాధించడంతో హంగ్ ఏర్పడింది. నర్సంపేటలో పూర్తిస్థాయి మెజార్టీ సాధించి దొంతి మాధవరెడ్డి తన సత్తాను చాటుకున్నారు. పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సై తం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటారు.
మున్సిపాలిటీల వారిగా పార్టీల బలాబాలాలు ఇలా ఉన్నాయి
మహబూబాబాద్ 36
కాంగ్రెస్ 13
బీఆర్‌ఎస్ 11
సిపిఎం 3
సీపీఐ 3
బీజేపీ 1
స్వతంత్రులు 5
నర్సంపేట 30
కాంగ్రెస్ 20
బిఆర్‌ఎస్ 7
బీజేపీ 1
సిపిఎం 1
స్వతంత్రులు 1
కేసముద్రం 16
కాంగ్రెస్8
బీ ఆర్ ఎస్ 8
------
భూపాలపల్లి 30
కాంగ్రెస్ 16
బీ ఆర్ ఎస్ 10
బిజెపి 2
సిపిఐ 1
స్వతంత్రులు 1
వర్ధన్నపేట 12
కాంగ్రెస్ 5
బీ ఆర్ ఎస్ 6
స్వతంత్రులు 1
జనగామ 30
కాంగ్రెస్ 12
బీ ఆర్ ఎస్ 13
సిపిఎం 1
స్వతంత్రులు 4
స్టేషన్ ఘనాపూర్ 18
కాంగ్రెస్ 13
బీ ఆర్ ఎస్ 5
------
మరిపెడ 15
కాంగ్రెస్ 9
బీ ఆర్ ఎస్ 5
స్వతంత్రులు 1
--
ములుగు 20
కాంగ్రెస్ 12
బీఆర్‌ఎస్ 5
బీజేపీ 1
స్వతంత్రులు 2
---------పరకాల 22
కాంగ్రెస్ 13
బీ ఆర్ ఎస్ 6
బీజేపీ 3
------
డోర్నకల్ 15
కాంగ్రెస్ 11
బీ ఆర్ ఎస్ 4
--------
తొర్రూర్ 16
టిఆర్‌ఎస్ 9
కాంగ్రెస్ 7