23 July, 2026 | 4:34 PM

మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా

23-07-2026 03:50 PM

నిర్మల్ జులై 23 (విజయక్రాంతి): నీట్ పరీక్ష వ్యవహారంలో శాంతియుత ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడానికి నివసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం మండల కేంద్రాలు ధర్నా నిర్వహించారు. లక్ష్మణ చందా, మామడ, సారంగాపూర్, దిల్వార్పూర్, నర్సాపూర్, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి విడనాడాలని వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.. అనంతరం తాసిల్దార్ కార్యాలయం లో వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమ్ రెడ్డి అబ్దుల్ ఆది నరేష్ రెడ్డి రామేశ్వర్ రెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.