15 June, 2026 | 2:50 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీసులు

13-06-2026 03:39 PM

షబ్బీర్ అలీ వైరల్ ఆడియోపై ఏఐసీసీ  సీరియస్

షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీస్ ఇచ్చాం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ(Senior Congress leader Shabbir Ali) వైరల్ ఆడియోపై ఏఐసీసీ సీరియస్ అయింది. షబ్బీర్ అలీ(Shabbir Ali) పార్టీ లైన్ దాటినట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అవినీతి ఆరోపణలు, మహిళలపై చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు(Show Cause Notice To Shabbir Ali) ఇచ్చినట్లు  టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్  తెలిపారు.

పైసలతోనే పదువులన్నట్లు మాట్లాడిన షబ్బీర్ అలీకి టీపీసీసీ నోటీసులు పంపి షాకిచ్చింది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. షబ్బీర్ అలీ ద్వారానే చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోకి వచ్చారని మహేశ్ గౌడ్ వివరించారు. అలాంటిది షబ్బీర్ అలీ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని ఆయన తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని సూచించారు. షబ్బీర్ తో వివాదం విషయంలో గతంలోనే చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితి మితిమీరడంతో షబ్బీర్ అలీకి నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.