ఇల్లు లేని నిరుపేదలకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
దోమకొండ, మార్చి 05, (విజయ క్రాంతి):ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డిలు అన్నారు. గురువారం దోమకొండలోని మెంగని వజ్రమ్మ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆమెకు మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్ బట్టలు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కృషితో దోమకొండ మండలంలో ఇప్పటివరకు 444 ఇల్లు మంజూరు కాగా, 406 మంది లబ్ధిదారులు మార్కవుట్ చేసుకున్నారన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 282 బేస్మేట్, 164 లెంటల్ లెవల్, 110 స్లాబ్, పూర్తి స్థాయిలో ఐదు నిర్మాణాలు జరిగాయని అన్నారు.
ఇల్లు లేని నిరుపేదలందరూ ఇల్లు నిర్మించుకోవటానికి సంతోషంగా ముందుకొస్తున్నారని తెలిపారు. పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తాము ఇల్లు నిర్మించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. గృహప్రవేశ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపు శ్రీనివాస్,నర్సారెడ్డి, సీతారాం మధు, సుధాకర్ యాదవ్, శమీ, కలీం,అబ్రబోయిన రాజు,పిన్నెం రామచంద్రం, నయీమ్, తదితరులు పాల్గొన్నారు.




