108, 102 అంబులెన్స్‌ల తనిఖీ
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆసుపత్రి వద్ద ఉన్న 108, 102 అత్యవసర సేవల అంబులెన్స్‌లను(ambulances) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, 108 జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ గురువారం ఆకస్మి కంగా తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో ఉన్న మెడికల్ స్టాక్, వైద్య పరి కరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు.
వేసవికాలంలో వడదెబ్బ కేసులు పెరిగే అవ కాశం ఉన్నందున అన్ని అంబు లెన్స్‌లలో డ్రగ్ చిల్లర్లు, ఐస్ ప్యాక్‌లు సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అలా గే 102 అంబులెన్స్ ద్వారా మండల ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర కాల్ వచ్చిన వెంటనే అంబులె న్స్ ఆలస్యం చేయకుండా వెంటనే బయలు దేరేలా అప్రమత్తంగా ఉండాల ని సిబ్బందిని సూచించారు. కార్యక్రమంలో 108 మెడికల్ టెక్నీషియన్లు ప్రవీణ్, అమృత రావు, పైలెట్లు భీమ్రావు, రమే ష్, 102 అంబులెన్స్ పైలెట్ సీతారాం తదితరులు పాల్గొ న్నారు.




