కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కై బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయడం లేదు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ బండి భగీరథపై నమోదైన ఫోక్స్ కేసులో మూడు రోజులు గడిచిన అరెస్టు చెయ్యకపోవడం వెనుక రాజకీయాల ఒత్తులు ఉన్నాయని నాగిరెడ్డిపేట్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మైనర్ బాలిక కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని,లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాగిరెడ్డిపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు.బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని బండి సంజయ్ కొడుకుపై నమోదైన కేసు తప్పుదోవ పట్టించడానికి బిజెపి నాయకులు చూస్తున్నారనన్నారు.
కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కై బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య,గోపాల్పేట్, మెల్లకుంట తండా గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, బాల్య నాయక్,సీనియర్ నాయకులు పేరుపల్లి సాయిబాబా,హనుమంత్ రెడ్డి,దుర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






