తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు: కవిత
హైదరాబాద్ నీటి కష్టాలు పరిష్కరించడంలో ప్రభుత్వ విఫలం
కమిషన్ల కోసమే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత్ర కట్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మహా నగర ప్రజలు నీటి కష్టాలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని కవిత ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని నీటి కష్టాల నుండి దూరం చేయడానికి దూరదృష్టి కొరవడటంతోనే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి హైదరాబాద్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్నసాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2, ఫేజ్ - 3 ను ప్రభుత్వం చేపట్టిందని ధ్వజమెత్తారు.
ఒక సంస్థకు భారీ లాభాన్ని చేకూర్చి భారీ మొత్తంలో కమీషన్లు దండుకోవాలనే ప్రభుత్వ పెద్దల కుట్రలతో హైదరాబాద్ మహా నగర ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారని కవిత వాపోయారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉందని హెచ్చరించినా ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకనైనా హైదరాబాద్ మహా నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలన్న కవిత గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.






