ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
07-07-2026 12:53 PM
హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం(Khairatabad RTO office) దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంక్రీట్ మిక్సర్ వాహనదారులు(Concrete mixer vehicle operators), కార్మికులు ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఆర్టీవో, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీవో అధికారులు అక్రమంగా భారీ జరిమానాలతో వేధిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 15-25 వేల జరిమానాలపై ఆందోళనకు దిగారు. ట్రాఫిక్, ఆర్టీఏ వేధింపులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.






