23 March, 2026 | 3:54 AM

మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ విఫలం

23-03-2026 12:00 AM

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట్, మార్చి 22 : (విజయక్రాంతి) : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గ బడంగ్ పేట 57వ డివిజన్లోని మధుర నగర్ కాలనీ ఫేస్ 3లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవాలు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రతివారం లో  రెండు మూడు రోజులు ఫాగింగ్ చేస్తూ దోమల నిర్మూలనకు కృషి చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలను  గాలికి వదిలేసిందని ఆరోపించారు.

స్థానిక మధురానగర్ కాలనీవాసుల అభ్యర్థుల మేరకు త్రీఫేస్ కరెంటు, రహదారుల నిర్మా ణం, జోనల్ కమిటీలో నిర్ణయం తీసుకుని సహకారం అందజేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  పొనుగోటి గిరి ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి మల్ రెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సమ్ రెడ్డి  స్వప్న వెంకట్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, రామిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.