ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు
తుమ్మల యుగంధర్
ఖమ్మం,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదల, సమయపాలనతో సాధించిన ఈ విజయము మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలక పాత్ర పోషించిందని ఆయన అభినందించారు.
పరీక్షల్లో విజయం సాధించిన ప్రతి విద్యార్థి మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే, ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు నిరుత్సాహ పడకుండా మరింత కృషి చేసి భవిష్యత్తులో విజయాలను సాధించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తుమ్మల యుగంధర్ ఆకాంక్షించారు.




