13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

రోడ్డు ప్రమాద బాధితులకు పరామర్శ

13-05-2026 08:38 PM

నంగునూరు,(విజయక్రాంతి): భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైన హనుమాన్ స్వాములను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పూజల హరికృష్ణ పరామర్శించారు. నంగునూరు మండలం అప్పలాయ చెరువు, నర్మెట గ్రామాలకు చెందిన భక్తులు గాయపడి పట్టణంలోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బాధితులకు ధైర్యం చెప్పి,మెరుగైన వైద్యం అందించాలని పూజల వైద్యులను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోల్ రాజ్ బహదూర్ రెడ్డి, కరుణకంటి రవీంద్ర చారి, ఎఎంసి వైస్ చైర్మన్ సాధుల పవన్ కుమార్, డైరెక్టర్లు ఎండి ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.