25 June, 2026 | 5:16 PM

దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం

25-06-2026 03:13 PM

చేగుంట జూన్ 25,విజయక్రాంతి: దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి అన్నారు,  ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ,మసాయిపేట్ మండలంలో అక్రమంగా  మట్టి మాఫియా దందాపై ఒక పరిశోధత్మక కథనాన్ని, జర్నలిస్ట్ మహేందర్ ఒక పత్రిక లో కథనం  రాశాడు,ఈ కథనం తో మట్టి మాఫియాకు అడ్డు వస్తున్నాడని, తీవ్ర అగ్రహానికి లోనై నిందితుడు,జర్నలిస్ట్ మహేందర్ పై కక్ష పెంచుకొని ఈ నెల 21వ తేదీన అసభ్య పదజాలంతో  కులం తక్కువ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు, రాత్రి సమయంలో మసాయిపేట్  లోని శేరి పంజాబీ ఢాబా వద్ద  జర్నలిస్ట్ మహేందర్ ఉండగా నిందితుడు, తనతో పాటు సుమారు 15 మంది అనుచరులను వెంట పెట్టుకొని వచ్చి, ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు,బాధితుడు ఎస్సి సామజిక వర్గనీకి చెందినవాడు అనీ తెలిసి కూడా దాడి చేసి,నిన్ను  వాహనం టైర్ కింద వేసి చంపుతానని బెదిరించినట్లు భాధితుడు తెలిపాడు.. దాడి చేసిన నిందితులను అరెస్ట్ చెయ్యాలని ఎమ్మార్పీఎస్  తెలంగాణ పక్షాన డిమాండ్  చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం లో జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ,బక్క బలేష్ , బక్క నరేష్ , శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు...