అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ
గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు బి.ఫార్మ్ చివరి ఏడాది విద్యార్థుల కోసం ‘ఫార్మాఎక్స్ ప్లోర్-2026: అధునాతన ఔషధ పరిశోధన అంతరంగం’ అనే నాలుగు రోజుల ప్రయోగశాల సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యాధునిక పరిశోధనా సదుపాయాలు, వర్ధమాన ఔషధ అభివృద్ధి సాంకేతికతలను ఔత్సాహిక ఫార్మసిస్టులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక విశిష్ట వేదికను కల్పించింది.
ఇందులో పాల్గొంటున్నవారు అధ్యాపకులు, పరిశోధకులతో చురుకుగా సంభాషిస్తూ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో విస్తృతంగా ఉపయోగించే ఆధునిక పరికరాలు, వినూత్న పరిశోధన సాధనాలతో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు. సమగ్ర అభ్యాస అనుభవంలో భాగంగా, విద్యార్థులను మార్గదర్శక ప్రయోగశాల పర్యటలకు తీసుకెళ్లి, అత్యాధునిక విశ్లేషణాత్మక పరికరాలను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తున్నారు.




