14 June, 2026 | 5:42 PM

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి

14-06-2026 04:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో ఆదివారం శక్తి మెస్ లో భోజనంలో  బద్దింక ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డిసెంబర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... బాసర IIIT లోని E-1, E-2 శక్తి మెస్‌లో ఆదివారం ఉదయం వడ్డించిన అల్పాహారంలో (చపాతీ, ఆలు కుర్మా) బొద్దింక కనిపించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. గతంలో కూడా భోజనంలో కప్పలు, బల్లులు రావడం, దీనివల్ల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ఆసుపత్రి పాలవ్వడం వంటి ఘటనలు జరిగాయి.

నిరంతరం ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికారుల నిర్లక్ష్యం వీడటం లేదు. విద్యార్థుల ఆరోగ్యం మరియు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బాసర IIIT యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని, ఒక ప్రత్యేక కమిటీని నియమించి, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని SFI నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. మెస్‌లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము