3 September, 2026 | 12:13 AM

Breaking News

పాలమూరు నీళ్లపై రాజకీయ పోరు.. ప్రజల్లో కొత్త చర్చ   •   యాక్టివ్ మోడ్‌లో బీజేపీ   •   పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •  

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

16-05-2025 | 12:00am

వనపర్తి మున్సిపల్ పరిధిలో కింది స్థాయి అధికారులు బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. యథేచ్ఛగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆస్తి పన్నుల వసూలులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధనవంతుల వద్ద తక్కువ పన్ను తీసుకుంటున్న అధికారులు పేదల వద్ద మాత్రం ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యూ అసెస్‌మెంట్, అండర్ అసెస్‌మెంట్ ప్రకారం భవనాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.

నంబర్లు లేని ఇండ్లు, షెడ్లు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఈ విషయమై వనపర్తి మున్సిపల్ సిబ్బందిపై సదరు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో రెండు సార్లు ఫిర్యాదు అందింది. వారిపై కలెక్టర్ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కలెక్టరేట్‌లో తమపై ఫిర్యాదు దాఖలైందని తెలిసినప్పటికీ మున్సిపల్ అధికారుల తీరులో ఎలాంటి మార్పూ లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఉన్నతాధికారుల పట్ల వారికున్న భయభక్తులనను ఎలా అర్థం చేసుకోవాలి?!

 పోలిశెట్టి బాలకృష్ణ, వనపర్తి