17 August, 2026 | 2:12 PM

వ్యతిరేక తీర్మానాలున్నా నిర్మాణాలు ఆగట్లేదని ప్రజావాణిలో ఫిర్యాదు

17-08-2026 01:05 PM

వ్యతిరేక తీర్మానాలున్నా నిర్మాణాలు ఆగట్లేదని ప్రజావాణిలో ఫిర్యాదు

భిక్కనూర్,ఆగస్టు 17(విజయక్రాంతి): వ్యతిరేక తీర్మానాలు ఉన్నప్పటికీ ఫ్యూజన్ ఫార్మా నిర్మాణ పనులు(Fusion Pharma construction) కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ బిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామ సర్పంచ్ మాలే నారాయణ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామాలు వ్యతిరేకంగా తీర్మానాలు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. నిర్మాణాలకు అనుమతులు ఎవరు ఇచ్చారో స్పష్టం చేసి, వివరాలను సంబంధిత గ్రామపంచాయతీలకు తెలియజేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయిస్తామని నారాయణ తెలిపారు.