ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
- రకాల ట్రక్ షిట్ లతో రైతులకు మోసం
- తిప్పర్తి మండలంలోని పలు కేంద్రాలకు పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం
- ప్రతి బస్తాకు కేజీన్నరకు పైగా అదరపు తూకం
నల్లగొండ టౌన్, మే 20 : ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరిగే అక్రమాలపై ఆధారాలతోటి బి ఆర్ ఎస్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఒక ట్రక్ సీట్ ఇవ్వగా మిల్లర్లు ఇచ్చేట్రక్ షి ట్ లో ధాన్యం తక్కువ క్వింటాళ్ల తో తరువచ్చిందని ఇస్తున్నారని కొన్ని కేంద్రాల్లో ట్రక్ షిట్ ఇవ్వడంలేదని వివరించారు కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలోని ధాన్య సేకరణ కేంద్రంలో రెండు రకాల ట్రక్ షీట్లతో రైతులను మోసం చేస్తున్నారని.. రైతులకు ఇచ్చే ట్రక్ షీట్లో ఒక రకమైన తూకం,.మిల్లర్ దగ్గర నుంచి మరో రకమైన తూకంతో ట్రక్ షీట్లు ఇస్తున్నారన్నారు.
డోరపల్లిలో కొనుగోలు కేంద్రం వద్ద ట్రక్ సీట్ ఇవ్వడం లేదని ఆధారాలు కలెక్టర్ కి అందజేసి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల తదితర ధాన్య సేకరణ కేంద్రాలకు బయట రాష్ట్రం నుండి ధాన్యం వస్తుందని తెలిపారు స్థానికంగా ఉన్న నాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై.. ఆ ధాన్యాన్ని కొంటున్నారన్నారు. దీనిపై మా నాయకులు ఆధారాలతో బయటపెట్టిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్ కు తెలియజేశారు.
నల్గొండ మండలం అన్నపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇంతవరకు 25 శాతం కొనుగోళ్లు జరుగ లేదని, వెంటనే చర్యలు తీసుకొని దాన్య సేకరణను వేగవంతం చేయాలని కోరారు. వీటన్నిటిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈయానా వెంట నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ మేక అరవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు ఎలుక శ్రీనివాస్ రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి పెఱిక కరుణ్ జయరాజ్, ఆయా గ్రామాలకు చెందిన రైతులు వెంట ఉన్నారు.






