ముఖ్యమంత్రిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
16-07-2026 12:25 AM
తాడ్వాయి, జూలై, 15( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి పోలీస్ స్టేషన్ లో బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్య మంత్రి తన హోదాను మరిచి గాలి మాటలు మాట్లాడుతున్నారన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం ప్రతిపక్ష నాయకులపై అరవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించి తన సత్తా చాటుకోవాలని సూచించారు. మా రక్తంతో పంటలు పండుతాయి అంటే మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, నాయకులు కపిల్ రెడ్డి, రాజి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమేష్ రావు, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






