తొలి వెలుగు రఘుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
దమ్మపేట, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ తొలి వెలుగు రఘు పై చర్యలు తీసుకోవాల్సిందిగా దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు, తుమ్మల అభిమానులు శుక్రవారం దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత 40 సంవత్సరాల నుండి రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మంత్రి తుమ్మల జీవితం తెరిచిన పుస్తకం అని, ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించే తుమ్మలపై రఘు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుపుతూ దమ్మపేట ఎస్ ఐ కి కాంగ్రెస్ నాయకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్, మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు, అడపా రాంబాబు, కాసాని నాగ ప్రసాద్, ఎండి వలీ పాషా, యర్రా వసంతరావు, ప్రభాకర్రావు, అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.




