ఎల్‌ఐసీ నికర లాభం రూ.13,492 కోట్లు
మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన క్యూ1 ఎఫ్‌వై 27 త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది. క్యూ1 ఎఫ్‌వై 26లోని రూ.10,986 కోట్లతో పోలిస్తే, ఏకీకృత నికర లాభం రూ.13,492 కోట్లుగా నమోదైంది, ఇది గతేడాది 22. 81% అధికం. అలాగే సంస్థ నికర ప్రీమి యం ఆదాయం వార్షికంగా 6.7% పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది (క్యూ1 ఎఫ్‌వై 26లోరూ.1.20 లక్షల కోట్లుగా ఉంది).
కొత్త వ్యాపారం విలువ (వీఎన్‌బీ) రూ.3,136 కో ట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 61.32% భారీ పెరుగుదలను సూచిస్తుంది. అ లాగే మొత్తం ఆదాయం రూ. 2,37,848 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో మొదటిసారి కట్టే ప్రీమియంలు రూ. 7,525 లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో తొలి ఏడాది ప్రీమియం వసూళ్ల ఆదాయం చూసుకుంటే ఎల్‌ఐసీ 60.1 శాతం మార్కెట్ వాటాతో అగ్ర స్థానంలో కొనసాగుతోందని కంపెనీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి తెలిపారు.






