బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి 8వ వర్ధంతి వేడుకలు...
బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. వాజ్‌పేయి సేవలు స్ఫూర్తిదాయకమని, దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రాజనీతి యోగ్యుడు అటల్ జీ. అపారమైన దూరదృష్టి ఉందని ఆయన మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన సుపరిపాలన ప్రజా సంక్షేమంపై చూపిన దృష్టి ఎల్లప్పుడు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు దేశ జాతీయ రహదారుల విస్తీర్ణం చేయడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు బిజెపి కౌన్సిలర్ గజల మహేష్ బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి చీకట్ల రాజు సాయి రెడ్డి ప్రదీప్ సింగ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.






