16 August, 2026 | 8:32 PM

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

16-08-2026 07:25 PM

ముకరంపుర, ఆగస్టు 16 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ విద్యానగర్‌ విజయదుర్గ కాలనీలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగమ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.