2 June, 2026 | 12:47 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్   •   గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి   •   సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్   •   సఫాయి కార్మికులకు ఘన సన్మానం..   •   పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •  

ధ్వన్యనుకరణ విద్యపై పుస్తకాన్ని ఆవిష్కరించిన హాస్యనటుడు జానీ లివర్

02-06-2026 12:43 AM

మంథని, జూన్ 1 (విజయ క్రాంతి): ముంబై ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, శిక్షకుడు రాజ్ కుమార్ రచించిన ధ్వన్యనుకరణ శాస్త్రం పుస్తకాన్ని బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు జానీ లివర్ ముంబైలో ఆవిష్కరించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానీ లివర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జానీ లివర్ మాట్లాడుతూ... మిమిక్రీ కళను శాస్త్రీయంగా పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.

ప్రతి కళాకారుడు తన కళా ప్రయాణంలో నిరంతరం శ్రమించాలని, ప్రేక్షకులకు ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనాన్ని అందించినప్పుడే కళాకారుడికి గుర్తింపు లభిస్తుందని ఆయన సూచించారు.ఠాకూర్ ఎడ్యుకేషన్ అకాడమీలో జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖ మిమిక్రీ కళాకారులు, సాహితీప్రియులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన జెసిఐ ఇండియా అలుమ్ని క్లబ్ జోన్ 12 పూర్వ చైర్మన్  జి.వి.ఎన్. రాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, విజయవంతంగా నిర్వహించారు.