28 April, 2026 | 6:51 PM

దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ

28-04-2026 04:51 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండలోని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన గోడపత్రికను స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ, ఈ కళాశాలకు పూర్వ విద్యార్థిగా ఉన్న ఎమ్మెల్యే చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ జరగడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ & అడ్మిషన్ కోఆర్డినేటర్ జి. కోటయ్య, అకాడమిక్ & దోస్త్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జి. లింగారెడ్డి తదితర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.