10 March, 2026 | 2:02 PM

ప్రజావాణి కార్యక్రమానికి 97 దరఖాస్తులు

10-03-2026 01:32 AM

కామారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో 97 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ఈ సందర్భంగా అధికారుల ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ సంబంధిత, సంక్షేమ పథకాలు, ఇతర సమస్యల పై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రాధాన్యత గా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.  ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో పాల్గొనాలని, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు

అన్ని కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని పరిశుభ్రత లో జిల్లాను ముందుంచాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేసి, పరిశుభ్రత పరంగా జిల్లాను ముందుండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.