ఘనంగా అమరజీవి బోడేపూడి వర్ధంతి
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వర రావు 29వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఎర్రుపాలెం మండల కేంద్రo లో కామ్రేడ్ రామిశెట్టి పుల్లయ్య భవనం నందు బోడెపుడి వెంకటేశ్వరరావు వర్ధంతి ఎర్రుపాలెం శాఖ కార్యదర్శి, దూదిగం బసవయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ అమరజీవి బోడేపూడి వెంకటేశ్వరరావు జీవితం ఓ తెరిచిన పుస్తకమని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం నుండి మధిర శాసనసభ సభ్యుడిగా నిత్యం రైతాంగ సమస్యలపై స్పందించినటువంటి ప్రజాప్రతినిధి శాసనసభ్యులు అంటే హైదరాబాదులో నివాసం ఉండటం కాదు రైతాంగం కోసం సాగర్ జలాల సాధన కోసం కాల్వకట్టలపై తిరిగిన చరిత్ర కామ్రేడ్ బోడెపూడి వెంకటేశ్వరరావు గారిదన్నారు.ప్రజలకు మంచినీటి అందించడంలో రాజకీయాలకి అతీతంగా ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిస్వార్ధంగా పనిచేసిన మచ్చలేని మహా మనిషి. రైతాంగానికి పేద ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చేసే ప్రతి పోరాటంలో కామ్రేడ్ బోడపూడి వెంకటేశ్వరరావు జీవితం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గామసు జోగయ్య, నాగులవంచ వెంకట రామయ్య,నక్కా పుల్లారావు, గొబ్బూరి కృష్ణంరాజు,అంజయ్య, వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.






