5 August, 2026 | 4:46 PM

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గడువు లోపు పూర్తి చేయాలి

05-08-2026 03:40 PM

- జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత

మెట్ పల్లి,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగంగా నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి దరఖాస్తు ఫారాలను పంపిణీ చేసి, నిర్దేశించిన గడువులోపు ప్రజల వద్ద నుండి ఫారాలను సంబంధిత బీఎల్ఓలు తీసుకోవాలని అన్నారు.

ప్రజలకు ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే తమ పరిధిలోని బీఎల్ఓలను లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఓటరుకు అవసరమైన సహాయం అందించేందుకు ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఆగష్టు పదవ తేదీలోపు ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్ఓకు అందజేసి, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని  విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మెట్ పెల్లి తహసీల్దార్ నీత,  బి.ఎల్.వో లు తదితరులు పాల్గొన్నారు.