11-02-2026 01:23:07 PM
- పలు పోలింగ్ స్టేషన్లో పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ కార్పొరేషన్,దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో పలు పోలింగ్ స్టేషన్ లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం సందర్శించారు.మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ నెంబర్ 19, ప్రాథమిక పాఠశాల తిమ్మసానిపల్లి, డివిజన్ నెంబర్ 7లో యూనివర్సల్ స్కూల్, శ్రీరామ కృష్ణ కాలనీ, డివిజన్ నెంబర్ 6 ప్రాథమిక పాఠశాల, ఏనుగొండ, డివిజన్ నెంబర్ 22 ప్రతిభా జూనియర్ కాలేజీ, పద్మావతి కాలనీ డివిజన్ నెంబర్ 46,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, న్యూ టౌన్ ( మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్), డివిజన్ నెంబర్ 60 ప్రభుత్వ బేసిక్ ప్రాక్టిసింగ్ హై స్కూల్. లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, దేవరకద్ర మున్సిపాలిటీ లో వార్డ్ నెంబర్ 11లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డ్ నెంబర్ 7 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, వార్డ్ నెంబర్ 1, 2లో ప్రాథమిక పాఠశాల చౌదర్ పల్లి.లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.