ప్రజావాణిలో 186 వినతుల స్వీకరణ
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ రూరల్ : ప్రజావాణిలో వచ్చిన పిర్యాదుదారుల దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్తానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జిదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అర్జిదారులకు హామీ ఇచ్చారు.
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా పరిశీలించి, సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 186 వినతులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ రాంరెడ్డి, జడ్.పి.సి.ఈ.ఓ, ఇంచార్జి డి.పి.ఓ వెంకటరెడ్డి, డి .ఆర్. డి.ఓ నరసింహులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






