సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి
చేర్యాల: చేర్యాల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం లోపల అన్ని గదులు తనికి చేశారు. ఇప్పటివరకు ఎంత ఓపి చూశారని మెడికల్ ఆఫీసర్ను ఆరా తీశారు.వైద్య పరికరాలు మందులు సమకూర్చుకుని రోగులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
మెడికల్ ఆఫీసర్ నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమయవేళలు పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో, గర్భస్థ మహిళల వార్డులలోని మహిళలతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉంది. డాక్టర్లు ఎలా చూస్తున్నారని అడగ్గా బాగానే ఉందని డాక్టర్లు నర్సులు బాగా రెస్పాండ్ అవుతున్నారని రోగులు కలెక్టర్ కి తెలిపారు. పట్టణ పరిధిలోని గ్రామాల్లోని గర్భస్థ మహిళల ఆరోగ్య స్థితి గతులను పర్యవేక్షణ చెయ్యాలని ప్రతి గర్భిణీ ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రికి ఒక్క మహిళ కూడా వెళ్లకుండా పని చెయ్యాలని మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం లను ఆదేశించారు.




