7 March, 2026 | 9:33 PM

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

07-03-2026 04:17 PM

* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపు

ఉట్నూర్,(విజయక్రాంతి): అన్ని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నారు. శనివారం ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత అని కొనియాడారు.

అతి పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని  మన దేశానికి అందించారని గుర్తు చేశారు. ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించే జయంతి ఉత్సవాలకు జిల్లాలోని విద్యార్థులు మేధావులు, దళిత సంఘాలతో పాటు  అన్ని వర్గాల ప్రజలు  హాజరుకావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కాడే ఉత్తం, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులతో పాటు   తదితరులు పాల్గొన్నారు.