20 June, 2026 | 6:42 PM

Breaking News

నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •  

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

31-03-2026 04:24 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సందర్శించారు. ఫ్యాక్టరీలోని గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్‌లో వడ్ల నిల్వకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని సమీక్షించారు. గోదాముల భద్రత, ప్రమాణాలు తేమ నియంత్రణ వంటి విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఇందిరామ్మా ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.