24 March, 2026 | 7:39 PM

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

24-03-2026 05:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇండ్ల వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులపై ఆరా తీశారు. త్వరగా పూర్తిచేసి ఇండ్లకు వెళ్లాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి కాంతారావు రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.