ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్
30-05-2026 05:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






