30 May, 2026 | 6:19 PM

కేజీబీవీ విద్యార్థుల ప్రతిభకు పట్టాభిషేకం

30-05-2026 05:13 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ (ఐసిఐ) కరీంనగర్ ప్రేరణ రీజియన్-9 ఆధ్వర్యంలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో 42 మంది విద్యార్థినులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలు, మానసిక ధైర్యం, వ్యక్తిత్వ వికాసం గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటమే తమ లక్ష్యమని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు తెలిపారు.