calender_icon.png 6 February, 2026 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

06-02-2026 10:05:08 PM

సర్పంచ్ యాదగిరి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామాల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే సమాజం ముందుకెళ్తుందని సర్పంచ్ నున్న యాదగిరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సంఘబంధం నూతన భవన నిర్మాణ పనులను ఎంపీడీఓ పల్లపు ఝాన్సీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలోని సమభవన సంఘాల మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇట్టి భవనాలను సమభావన సంఘాల మహిళలు వినియోగించుకుని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యానాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణ నాయక్, ఉపసర్పంచ్ మాండ్ర గోవర్ధన్,మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి అరుణజ్యోతి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తోడుసు మల్లేష్, వార్డు సభ్యులు నున్న సురేష్ యాదవ్, మాండ్ర అంజమ్మ, బీఆర్ఎస్ నాయకులు మహేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.