ఏజెన్సీ విద్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
హెచ్‌ఎం, వార్డెన్లకు షోకాజ్ నోటీసులు
మహబూబాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడా ఏజెన్సీ ప్రాంతంలో విద్యాలయాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొత్తగూడ ఏహెచ్‌ఎస్ హెచ్‌ఎం, వార్డెన్ల కు షోకాజ్ నోటీస్ లు జారీ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కొత్తగూడ మండలం పోగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈఎంఆర్‌ఎస్ లోనీ తరగతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టాక్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు పక్కాగా డైట్ మెనూ ప్రకారం ఆహారం అందించాలని,
పిల్లల యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులు గమనిస్తూ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బందికి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు పాటించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లో ప్రతి తరగతి గది, వసతి గృహంలోని రూములను,
వంట సిద్ధం చేసే ప్రదేశం, డైనింగ్ హాల్, టాయిలెట్స్, డార్మెటరీలను తనిఖీ చేసి స్వయంగా విద్యార్థులతో మాట్లాడారు. వసతి గృహం నిర్వహణలో అలసత్వం వహించిన ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, వార్డెన్ అనూషలకు షోకాజు నోటీస్ జారీ చేయాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలలో పిల్లలకు అందించే విద్యా బోధన, హాస్టల్లో నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.




