20 May, 2026 | 6:54 PM

రైస్ మిల్లు సందర్శించిన కలెక్టర్

20-05-2026 05:30 PM

అన్లోడింగ్ వేగవంతం చేయాలని ఆదేశాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, శాకంబరి రైస్ మిల్లును సందర్శించారు, ధాన్యం కొనుగోలు ,అన్‌లోడింగ్ కార్యకలాపాలను సమీక్షించారు.పరిశీలన సందర్భంగా పీపీసీల వద్ద పెండెన్సీ తగ్గించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పీక్ ప్రొక్యూర్‌మెంట్ సీజన్, వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వాహనాల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ నుండి సుమారు 85 శాతం బాయిల్డ్ రైస్ అలొకేషన్ ముందుగానే అందినందుకు మిల్లర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్‌లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్, , జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ , తహసీల్దార్  డీటీసీఎస్ , తదితరులు పాల్గొన్నారు.