calender_icon.png 11 February, 2026 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

11-02-2026 12:57:56 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపాలిటీ లోని వార్డు నెంబర్ 18  లిమ్ర గార్డెన్ సమీపంలో గల ప్రైమరీ స్కూల్, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం  ps.no.55 పోలింగ్ కేంద్రములో  బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని స్థానిక సుపరిపాలనలో భాగస్వాములు కావాలని అన్నారు.

ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పోలీస్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 17 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రాలకు  తీసుకువెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.