calender_icon.png 11 February, 2026 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు నిఘా

11-02-2026 12:55:18 PM

షాద్ నగర్ డిసిపి సిహెచ్ శిరీష రాఘవేంద్ర 

షాద్ నగర్ లో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ 

షాద్‌నగర్,(విజయక్రాంతి): మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భారీ పందోబస్తును ఏర్పాటు చేశామని, సామస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘాను పెట్టినట్లు షాద్ నగర్ డీసీపి సిహెచ్ శిరీష రాఘవేంద్ర తెలిపారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పలు వార్డులను ఆమె స్థానిక ఎసిపి లక్ష్మీనారాయణ, పట్టణ సిఐ విజయ్ కుమార్ తదితరులతో కలిసి బందోబస్తు పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉన్నాయని, ఇందులో 8 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. 350 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుగుతున్నాయని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. ఇలాంటి ప్రలోభాలకు భయభ్రాంతులకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు, ఇతర సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 11 గంటల వరకు 26% పోలింగ్ జరిగిందని ఆమె వివరించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, అదేవిధంగా ఓటర్లు ఐదు గంటల లోపల పోలింగ్ కేంద్రం ఆవరణలో చేరుకుంటేనే ఓటు వేయవచ్చని, 5 గంటల తర్వాత ఓటు వేసేందుకు అనుమతి లేదని ఆమె తెలిపారు.