17 March, 2026 | 7:49 PM

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

17-03-2026 06:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని  సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు.

సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు..మజార్, శ్రావణ్ రెడ్డి, రమేష్, ఎస్ఎన్ రెడ్డి, రాజేశ్వర్, ఎస్. రమేష్, నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.