4 March, 2026 | 5:47 PM

మహిళా సంఘాల పాత బకాయిలు వసూలు

04-03-2026 04:10 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఐకెపి ద్వారా తీసుకున్నటువంటి లోన్లు, శ్రీనిధి పాత బకాయిలు 7 క్లస్టర్లలో గల వివిధ గ్రామాల్లో రికవరీ టీం వసులు చేయడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇంచార్జ్ ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ... చిన్న లోన్లు కట్టి పెద్ద లోన్లను తీసుకోవాలని నినాదంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రికవరీ స్పెషల్ డ్రైవ్ ఐదు రోజులపాటు కొనసాగుతుందని మండలంలో మొండి బకాయిలు ఉన్నవారు కట్టాలన్నారు.

బుధవారం మండలంలోని అక్కంపల్లి, రాఘవపల్లి, లింగంపల్లి, మాసంపల్లి, మాల్తుమ్మెద గ్రామాలలో రికవరీ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. అక్కంపల్లి గ్రామ సంఘంలో 21000/-రాఘవపల్లి 40,000/-లింగంపల్లి 5000/- మాసంపల్లి 15000/-మాల్తుమ్మెద 89000/- గ్రామాలలో కలిపి 1,70,000 మొండి బకాయిలు వసూలు చేసినట్లు ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, సర్పంచులు సాయిలు, వెంకాగౌడ్, నార్ల గంగమణి మల్లేశం, అనిత గోపాల్ గౌడ్, పెద్దపట్ల సునంద కిషన్ రెడ్డి, కార్యదర్శులు అశోక్ కుమార్, కిష్టయ్య, వనజ, సుభాష్ రెడ్డి,సీసీలు శ్రీనివాస్ రెడ్డి, నారాయణ, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.