17-02-2026 07:42:33 PM
- సీఎంపీ ఎఫ్ రీజనల్ కమిషనర్ హరి పచౌరి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): జాప్యం లేకుండా ఉద్యోగులకు త్వరగా సీఎంపీఎఫ్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీ.ఎం.పి.ఎఫ్ రీజినల్ కమిషనర్–1 హరి పచౌరి, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీ.ఎం.పి.ఎఫ్, పెన్షన్ లకు సంబంధించిన లావాదేవిలు, సి-కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగు తున్నట్టు తెలిపారు.
అలాగే కొత్తగా సీఎంపిఎఫ్ పెన్షన్ కి సంబంధించిన క్లెయిమ్స్ త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయాస్ అనే పద్దతిని తీసుకువచ్చామని వెల్లడించారు. బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జీరో పెండింగ్ గా సీఎంపిఎఫ్ పెన్షన్ సంబంధించిన క్లైములను సెటిల్ చేస్తున్నామని తెలిపారు. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా సీ.ఎం.పి.ఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని తెలిపారు. ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా 118 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (ఫార్మర్ & సర్వైవర్) సెటిల్మెంట్ కాపీలను సంబంధిత అధికారులకు సీ.ఎం.పి.ఎఫ్ రీజినల్ కమిషనర్–01 హరి పచౌరి అందచేశారు. ఫిబ్రవరి నెలలో పదవీ విరమణ చేయబోతున్న సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్-01 హరి పచౌరీకి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, ఏఐటీయూసి రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, డీజీఎం పర్సనల్ అశోక్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ,అధికారులు యూనియన్ నాయకులు సన్మానం చేశారు.
- కాంట్రాక్ట్ ఉద్యోగి ఖాతాలో పీఎఫ్, పెన్షన్ డబ్బులు
కే.తిరుపతి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కి 2023 నుండి పరిష్కారం కావాల్సిన పిఎఫ్, పెన్షన్ డబ్బులను ప్రయాస్ C-Care పోర్టల్ ద్వారా తక్షణమే పరిష్కరించి అతని అకౌంట్ లో జమచేశారు. ఈ సందర్భం గా సదరు ఉద్యోగి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో AITUC రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రెటరీ దాగం మల్లేష్, మందమర్రి ఏరియా డీ.జీ.ఎం పర్సనల్ అశోక్, రీజినల్ కమిషనర్ –02 గోవర్ధన్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ,అన్ని గనుల సంక్షేమ అధికారులు, సీఎం పిఎఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు.