అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్
03-07-2026 11:47 AM
ఎర్రుపాలెం జులై 3 ( విజయ క్రాంతి):మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామంలో నవ శకం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు . వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా వచ్చిన గ్రామ సర్పంచ్ కాలసాని నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేకల రమేష్ , గ్రామ సెక్రెటరీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






