కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?
తెలంగాణకు తీరని నష్టం.. అభ్యంతరం లేవనెత్తాం
దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ కుట్ర
హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సోనియాగాంధీ(Sonia Gandhi) చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. హైడ్రిడ్ మోడల్ లో డీలిమిటేషన్(Delimitation) చేపట్టాలని సీఎం డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును(Women's Reservation Bill) లోక్ సభలో అన్ని పార్టీలు అడ్డుకున్నారని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాదిన కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గి సీట్లు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించి జనాభా నియంత్రణ పాటిస్తే నష్టం చేస్తున్నారని సీఎం ద్వజ మెత్తారు. తెలంగాణకు తీరని నష్టంపై అభ్యంతరం లేవనెత్తామని చెప్పారు.
కేంద్ర నిబంధనలు(Central Regulations) పాటిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడంపై పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. రాజ్యాధికారం అంతిమ లక్ష్యమని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. రాజ్యాధికారం సాధించాలంటే సీట్లు సంఖ్య పెరగాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిన రాష్ట్రం, జనగణనతో పాటు కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ ప్రభుత్వం మీదే అన్న సీఎం రేవంత్ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేదే అన్నారు.






