24 August, 2026 | 6:36 PM

లండన్‌కు అనుమతి... అమెరికా పర్యటనకు నో

24-08-2026 05:03 PM

హైదరాబాద్: నా అమెరికా పర్యటనకు అనుమతిని కేంద్రప్రభుత్వం నిరాకరించిందని, వికసిత్ భారత్ లో లక్ష్యంగా మేం తెలంగాణ రైజింగ్-2047 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకారించటం మన సమాఖ్య స్ఫూర్తి అని, విద్యలో సహకారం, పెట్టుబడులు ఆకర్షించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. పెట్టుబడుల సాధన కోసం గతంలోనూ విదేశాలకు వెళ్లామని, కానీ ఈసారి లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా వెళ్లకుండా చేశారని  సీఎం ఆగ్రహించారు.

విదేశీ పర్యటనకు దరఖాస్తు చేసినప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా పేర్కొన్నామని, అమెరికాలో ప్రఖ్యాత యూనివర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని చెప్పినప్పటికి రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని విదేశాంగశాఖ బదులుచ్చిందని ఆయన మండిపడారు. కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నేతలు నా అధికారిక పర్యటనపై కేంద్రానికి అవాస్తవాలు చెప్పి తప్పుదోవ పట్టించారని, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఎన్నో దేశాల్లో పర్యటించారని, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఎన్నో దేశాల్లో పర్యటించారని సీఎం గుర్తు చేశారు.

గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి మిమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్, ప్యూచర్ సిటీలో పెట్టుబడులకు విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపాయని, ప్రఖ్యాత యూనివర్సిటీలతో ఎంవోయూలు చేసుకునేందుకు అమెరికా పర్యటన తలపెట్టినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. విదేశీ యూనివర్సిటీలు మన వద్దకు వస్తే మన విద్యార్థులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, తెలంగాణ సీఎంకు అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.