5 June, 2026 | 2:52 PM

Breaking News

సీఎం దిష్టిబొమ్మ దహనం.!

05-06-2026 12:41 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు. 

అక్రమ అరెస్టులపై నిరసన తెలిపిన బిఆర్ఎస్ నేతలు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district) తిమ్మాజిపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిమ్మాజిపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిరసనలకు అవకాశం లేకుండా ముందస్తు అరెస్టులు గృహనిర్బంధం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నిరసనపై బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. నిరసనలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Former MLA Marri Janardhan Reddy) స్వగృహం లో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు(BRS leaders) మాట్లాడుతూ పాలమూరు ప్రాంత అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పష్టమైన నిధుల ప్రకటన చేసిన తర్వాతే సీఎం పర్యటన జరగాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) విస్మరించిందని, “రైతుబంధు” పథకం అమలులో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, ప్రాజెక్టుల పూర్తి విషయంలో జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రాజకీయ ప్రదర్శనలు మాత్రమే చేస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కెసిఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలమూరు ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని గతంలోనే ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు.