5 June, 2026 | 1:18 PM

నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల పనుల పరిశీలన

05-06-2026 12:16 PM

పంప్ హౌస్ పరిశీలన. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో(Palamuru-Rangareddy Lift Irrigation Scheme) భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనులు, పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణ రావు , వాకటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించి, జరుగుతున్న పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.