5 June, 2026 | 2:52 PM

Breaking News

ముత్తారంలో ఇందిరమ్మ ఇంటి దర్వాజా ఎత్తిన కార్యక్రమంలో పాల్గొన్న నాగినేని దంపతులు

05-06-2026 12:44 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు  గుడికందుల అంజలి, రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయగా, శుక్రవారం ఆ ఇంటి దర్వాజా ఎత్తే కార్యక్రమంలో ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు,పద్మా దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు అంజలి, రాజు దంపతులకు నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బొల్లినేని బుచ్చం రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, ముత్తారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కోల విజయ్, వార్డు సభ్యుడు కుక్కల చందు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చారి, ఆల్గం రాజేశం తదితరులు పాల్గొన్నారు.