బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ
బాసరలో మనవడికి చేయించిన రేవంత్ రెడ్డి దంపతులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి దేవస్థానంలో ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ(Basara Temple Renovation Works) చేశారు. బాసరలో రేవంత్ రెడ్డి దంపతులు మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. బాసరలోని సరస్వతీదేవి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
రూ 225 కోట్లతో శ్రీ జ్ఞాన సరస్వతి బాసర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ బీఫ్ సుదర్శన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రామారావు పటేల్, విడుమ బుజ్జి పటేల్, వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు ప్రత్యేక కార్యదర్శి శైలజ రామయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.




